ప్రజాశక్తి-కనిగిరి: మద్యం నూతన పాలసీని వ్యతిరేకిస్తూ కనిగిరి పట్టణంలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు బుధవారం సాయంత్రం నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయం వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన తెలిపారు. మద్యం వద్దు.. మంచినీళ్లు కావాలి అంటూ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదా లు చేశారు. ఐద్వా నాయకురాలు ఎస్‌కే బషీర, ప్రసన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం మద్యం విక్రయాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడగా ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ నూతన మద్యం పాలసీని తీసుకురావడం దారుణం అన్నారు. సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాలన వంద రోజులు దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం ప్రజలను మోసగించ డమేనని విమర్శించారు. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలను వెంటనే అదుపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు శాంతకుమారి, రత్తమ్మ, ఎలీషమ్మ, వెంకటమ్మ, లాల్‌బి, రమణమ్మ, ఆదిలక్ష్మి, పొట్టెమ్మ, సిఐటియు జిల్లా నాయకులు పిసి కేశవరావు, డివైఎఫ్‌ఐ నాయకులు నరేంద్ర, సిఐటియు నాయకులు ఏడుకొండలు, పిచ్చయ్య, టోపీవలి, జి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. సంతనూతలపాడు: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన నూతన మద్యం పాలసీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి ఐద్వా మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా మండల కార్యదర్శి నెరుసుల మాలతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న మద్యం పాలసీ నూతన విధానాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రైవేటు వ్యక్తులకు టెండర్ల ద్వారా లైసెన్స్ ఇవ్వడం వల్ల మహిళలపై హింస, దాడులు మరిం త పెరిగే అవకాశం ఉందని ఆమె అన్నారు. గుడి, బడి నివాస ప్రాంతాల దగ్గర్లో మద్యం షాపులను నిర్వహించకూ డదని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారంలో ఒకరోజు డ్రైడేగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు. మద్యం షాపుల లైసెన్స్‌ల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి 2000 కోట్ల రూపాయల ఆదాయ వనరుగా ఉందన్నారు. ఈ కార్యక్ర మంలో ఐద్వా నాయకులు కే బుజ్జి, మేఘన, శృతి, జేవీవీ జిల్లా నాయకులు కోదాటి కోటేశ్వరరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.మహాత్మాగాంధీకి వినతిపత్రం ఇస్తున్న ఐద్వా నాయకులు పామూరు: తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీ విధానం వల్ల ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్‌గా మారుస్తుందని, వెంటనే ఈ పాలసీని రద్దు చేయాలని ఐద్వా మండల కార్యదర్శి సయ్యద్ ఖాదర్ నిషా అన్నారు. బుధవారం గాంధీ జయంతి రోజున గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మద్యాన్ని నియం త్రించే విధంగా నేరాలను అరికట్టే విధంగా పాలసీమ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మద్యం వల్ల మహిళల మీద దాడులు అత్యాచారాలు జరుగుతున్నా యని, ఎన్ని చట్టాలు అమలు చేసినా మహిళలకు రక్షణ లేకుండా పోతోందన్నారు. ఇదే కొనసాగితే నేరాలు పెరిగి అవకాశాలు ఉన్నాయన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు ఉండాలని, లేనిపక్షంలో మహిళలు ఐక్యమై ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ వినతిపత్రం కార్య క్రమంలో ఐద్వా సీనియర్ నాయకురాలు షేక్ మదారమ్మ, సయ్యద్ రమీజా, కే ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.