నో రాజీ .. ఇక యుద్దమే ..

Feb 27,2024 13:00 #bhimavaram, #fight, #TDP

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : ‘ రాజుల కోటలో .. యుద్ధం సిద్ధమయ్యింది.. ఎదురుపడ్డా .. ఇద్దరు రాజులు.. ‘ రాజీకి వచ్చిన ఎమ్మెల్యే మంతెన రామరాజుకు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు నుంచి పరాభవం ఎదురయ్యింది .. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజక వర్గం .. ఒకరు ఎమ్మెల్యే మంతెన రామరాజు, మరొకరు మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు .. వారిలో ఎమ్మెల్యే రామరాజుకు అధిష్టానం ఉండి టిడిపి సీటును కేటాయించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆగ్రహించారు. మంగళవారం భీమవరంలోని శివరామరాజు కార్యాలయానికి ఎమ్మెల్యే రామరాజు వచ్చి శివ మద్దతును కోరడంతో ఆయన నిరాకరించారు. ఇక్కడ నుంచి వెళ్ళిపో .. నేను నీకు మద్దతు ఇవ్వను .. నేను ఏమిటో చూపిస్తా .. నా అనుమతి లేకుండా నా కార్యాలయంలో ఆయనతో ఎలా మాట్లాడతారని విలేకరులపై కూడా ఆగ్రహించారు. ఎమ్మెల్యే రామరాజుకు పరాభవం కావడంతో అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున శివ నినాదాలు చేశారు.

➡️