రేపటితో నామినేషన్ల ముగింపు

Apr 23,2024 23:43

గుంటూరు ఎంపీ స్థానానికి ఇండియా బ్లాక్‌ తరుపున సిపిఐ అభ్యర్థిగా జంగాల అజరుకుమార్‌ నామినేషన్‌ దాఖలు సందర్భంగా గుంటూరులో ర్యాలీ
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురటూరు, పల్నాడు జిల్లాలో మంగళవారం పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు గురువారం తుది గడువు కావడంతో బుధ, గురువారాల్లో ఎక్కువగా నామినేషన్లు దాఖాలు చేసే అవకాశం ఉంది. గుంటూరు లోక్‌సభ నుంచి ఇండియా బ్లాక్‌ తరుఫున సిపిఐ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ కలెక్టర్‌కు తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అజరుకుమార్‌ వెంట సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి తదితరులున్నారు. నర్సరావుపేట లోక్‌సభకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా అలెగ్జాండర్‌ సుధాకర్‌, చిలకలూరిపేట నుంచి పత్తిపాటి పుల్లారావు (టిడిపి), కాంగ్రెస్‌ అభ్యర్థులు కాంగ్రెస్‌ అభ్యర్థి సిహెచ్‌.శ్రీనివాసరావు (వినుకొండ), నర్సరావుపేట నుంచి షేక్‌ మహబూబ్‌ బాష, వైసిపి అభ్యర్థులు అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), కాసు మహేష్‌రెడ్డి (గురజాల) తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు.

వాహనంపై అభ్యర్థితోపాటు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, గుంటూరు తూర్పు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్‌వలి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

పల్నాడు జిల్లాలో మొత్తం 34 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 16 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. సత్తెనపల్లిలో వైసిపి అభ్యర్థి అంబటి రాంబాబు తరుఫున కల్లం విజయభాస్కరరెడ్డి నామినేషన్‌ దాఖల చేశారు. నర్సరావుపేటలో టిడిపి అభ్యర్థి అరవిందబాబు తరుఫున మరోసారి కొర్రపాటి శ్రీనివాసరావు నామినేషన్‌ దాఖలు చేశారు. నర్సరావుపేట లోక్‌సభ స్థానానికి ఇండియా ప్రజాబంధు తరుఫున జి.భూషణం, జైభీమ్‌ భారత్‌ నుంచి కూచిపూడి జాన్‌ బాబు, పెదకూరపాడులో భారత చైతన్య యోజన నుంచి ఆలా రామకృష్ణారావు, చిలకలూరిపేట నుంచి ఇండియన్‌ లేబర్‌ పార్టీ తరుఫున మురికి రామకోటేశ్వరరావు, నర్సరావుపేట అసెంబ్లీకి జైభీం భారత్‌ పార్టీ అభ్యర్థిగా గోద జాన్‌పాల్‌, సత్తెనపల్లికి జాతీయ జనసేనపార్టీ నుంచి గోదా వెంకట రమణ, బిఎస్‌పి నుంచి పి.నవీన్‌ బాబు, వినుకొండ నుంచి జై భారత్‌ నేషనల్‌ పార్టీ తరుఫున చిరంజీవి నాయక్‌, గురజాలలో బిఎస్‌పి నుంచి నాగేంద్ర యోబు, నేషనల్‌ నవక్రాంతి పార్టీ తరుఫున కనకం శ్రీనివాసరావు నామినేషన్లు వేశారు.

➡️