మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడులో నామినేషన్లు దాఖలు

మంగళగిరి: మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గానికి మం గళవారం ఆరుగురు వ్యక్తులు తొమ్మిది నామి నేషన్లు దాఖలు చేసి నట్లుగా నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి జి.రాజకుమారి తెలిపారు. ఇండిపెం డెంట్‌గా కె.సుధీర్‌ బాబు, జె.లోకేశ్వరరావు, పి.నాగేశ్వరరావు, జి.నాగరాజు, షేక్‌ రహీం, సిహెచ్‌ బాల సూర్య ప్రకాష్‌, మురు గుడు సత్యం రెండవ సెట్టు, వైసిపి తరఫున మురుగుడు లావణ్య మూడవ సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. జై భీమ్రావు భారత పార్టీ తరఫున జె.శ్రావణ్‌కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేసినట్లుగా తెలిపారు. తాడికొండలో రెండు నామినేషన్లు తాడికొండ: తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలకు సంబం ధించి మంగళవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. నవ రంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గుర్రం రామారావు, స్వతంత్ర అభ్య ర్థిగా గొడవర్తి ప్రసన్నకుమార్‌ నామినేషన్లు ఆర్‌ఒ ఎం గంగ రాజుకు దాఖలు పరిచారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆరు నామినేషన్లు ప్రత్తిపాడు: ప్రత్తిపాడు నీయోజక వర్గ కేంద్రం లో మంగళ వారం ఆరు నామినేషన్లు నమోదు అయినట్లు అర్‌ఒ శ్రీకర్‌ తెలిపారు.ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా కత్తి అరుణ్‌ కుమార్‌ చంద్రం కృష్ణంరాజు, జాతీయ జనసేన పార్టీ నుంచి బుర్రి రాంబాబు ,ఇండియన్‌ లేబర్‌ పార్టీ ఎండ్రపాటి పాల్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియ పార్టీ నుంచి రెండవ సెట్‌ను చల్ల శరత్‌ కుమార్‌ నామినేషన్‌, బిసివై పార్టీ నుంచి సంకురి స్తోత్ర రాణి రెండవ సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. మంగళవారం మొత్తం ఆరు నామినేషన్లు దాఖలైనట్లు అర్‌ ఒ శ్రీకర్‌ తెలిపారు.

➡️