నార్త్‌, సౌత్‌ జోన్‌, తూర్పు గోదావరి జట్లు విజయం

ప్రజాశక్తి-కడప జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎసిఎ అండర్‌-23 ఇంటర్‌ జోనల్‌ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్లో భాగంగా బుధవారం వివిధ క్రీడా మైదానాల్లో జరిగిన పోటీల్లో నార్త్‌, సౌన్‌ జోన్‌, తూర్పు గోదా వరి జట్లు విజయం సాధించాయి. కెఒఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అనంతపురం జట్టుపై తొమ్మిది వికెట్ల తేడాతో రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌ జోన్‌ జట్టు విజయం సాధించింది. టాస్క్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు 27.4 ఓవర్లలో 97 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని అర్జున్‌ టెండూల్కర్‌ 45, జయకృష్ణ 14 పరుగులు చేశారు. రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌ జోన్‌ జట్టులోని శ్రీకర్‌ సాయి రెడ్డి 4, అచ్యుత్‌ హేమంత్‌ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 98 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారం భించిన రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌ జోన్‌ జట్టు 14.2 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 101 పరుగులు చేసి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని హిమకర్‌ 56 హర్షవర్ధన్‌ 34 (నాటౌట్‌) పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని మల్లికార్జున ఒక వికెట్‌ తీసుకున్నాడు.ప్రకాశంపై సౌత్‌ జోన్‌ జట్టు..: కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ప్రకాశం జట్టుపై 8 వికెట్ల తేడాతో రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌ జోన్‌ జట్టు విజయం సాధించింది. పుల్కా బ్యాటింగ్‌ చేసిన ప్రకాశం జట్టు 37.0 ఓవర్లలో 221 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని రోహిత్‌ 67, అభినవ్‌ 38 పరుగులు చేశారు. రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌ జోన్‌ జట్టులోని సుతేజ్‌ రెడ్డి 4 మాధవ్‌ 3, ధరణి కుమార్‌ నాయుడు 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 222 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ కు దిగిన రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌ జోన్‌ జట్టు 36.1 ఓవర్లలో 222 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని రేవంత్‌ రెడ్డి 99 (నాటౌట్‌), తేజ రెడ్డి 55 పరుగులు చేశారు.సెంట్రల్‌ జోన్‌పై తూర్పుగోదావరి జట్టు..: వైఎస్‌ఆర్‌ఆర్‌ ఎసిఎ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ జట్టుపై రెండు వికెట్ల తేడాతో తూర్పు గోదావరి జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ జట్టు 38.2 ఓవర్లలో 129 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని సమన్విత్‌ 35, దుర్గారావు 24 పరుగులు చేశారు. తూర్పు గోదావరి జట్టులోని సందేశ్‌ నాలుగు, శివ సూర్య రెండు, వంశీ నారాయణ రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం 130 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ కుదిగిన తూర్పు గోదావరి జట్టు 32.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132పరుగులు చేసి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రాజెక్టులోని విజరు 51, రంగరాజు 32 పరుగులు చేశారు. రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ చెట్టులోని మానస్‌ అదుÄతేంగా పోలింగ్‌ ప్రదర్శించి ఆరు వికెట్లు తీసుకున్నాడు.

➡️