ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ (తూర్పు గోదావరి) : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కోసం రూ.101 కోట్ల 95 లక్షల 95 వేల 500 లని సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9,041 క్లస్టర్ల పరిథిలో 4,858 మంది పెన్షన్ పంపిణీ సిబ్బందిని నియమించి, పెన్షన్ లబ్దిదారులతో మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. అక్టోబర్ ఒకటవ తేదీ మంగళవారం ఉదయం నుంచే ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని క్షేత్ర స్థాయి అధికారులకి, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధులు సమక్షంలో లబ్దిదారులకు ఇంటి వద్దనే పంపిణి చేయనున్నట్లు తెలిపారు.