వైసిపికి ఓటు వేయలేదని దాడి

Jun 9,2024 21:42

ప్రజాశక్తి – నందిగామ : నందిగామ మండలం కొతమాత్మకూరు గ్రామంలో వైసీపీకి ఓటు వేయలేదని ఆక్రోశంతో భవన నిర్మాణం కార్మికుడు, కుటుంబ సభ్యులపై దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం కొతమాత్మకూరు గ్రామంలో భవన నిర్మాణ పనులు చేస్తున్న షేక్‌ చిన లాల్‌ షా, భార్య నసీమా, కుమారుడు నాగుల్‌ మీరాలను, అదే గ్రామానికి చెందిన షేక్‌ మహబూబ్‌ సుభాని,షేక్‌ లాల్‌లపై దాడి చేశారు. లాల్‌షాకు బలమైన దెబ్బలు తగలడంతో నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను సిపిఎం నందిగామ నాయకులు సయ్యద్‌ ఖాసింలు పరామర్శించారు. దాడి చేసిన నిందితులను నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

➡️