తిరుపతమ్మను దర్శించుకున్న ప్రముఖులు

Jun 9,2024 21:39

స్ధానిక శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని ఆదివారం కృష్ణ జిల్లా పెడన నూతన శాసన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్‌, ఉమ్మడి జిల్లా జడ్జి సారిక అరుణ, జగ్గయ్యపేట సివిల్‌ జడ్జి శ్రావణి శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. విజయవాడ మాచవరం డౌన్‌కు చెందిన మల్లెల రిషేక్‌ సాయి ఆలయంలో జరుగుతున్న నిత్య అన్నదాన పథకానికి రూ.10 వేలు విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు అమ్మవారి స్వామివారి శేష వస్త్రాలు ప్రసాదాలు అందించారు.

➡️