స్వర్ణ నంది పురస్కారం గ్రహీతలకు అభినందనలు

Jun 10,2024 21:53

ప్రజాశక్తి – జగ్గయ్యపేట : హైదరాబాదులో నిర్వహించిన ఆదర్శ స్వర్ణ నంది పురస్కారంలో మన జగ్గయ్యపేటలోని సత్యా కూచిపూడి డాన్స్‌ అకాడమీ పాల్గొన్న 18 మంది విద్యార్థులు జగ్గయ్యపేటలో మొట్టమొదటిసారిగా స్వర్ణ నంది పురస్కార గ్రహీతలుగా నిలిచారు. వారికి సత్య కూచిపూడి డాన్స్‌ అకాడమీ యాజమాన్యం తరఫున ఓగిరాల రామకృష్ణారావు, కూచిపూడి గురువులు కృష్ణవేణి, మానస, లావణ్య, దివ్యకు స్వర్గానంది గ్రహీతలకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. వారు చదువుతున్న పాఠశాల యాజమాన్యం వారు కూడా ఆ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

➡️