సిపిఎం ఆధ్వర్యంలో నిరసన
ప్రజాశక్తి-వీరులపాడు : ఎన్టీఆర్ జిల్లా జుజ్జూరు మండల కేంద్రంలో పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు జుజ్జూరు మండల కేంద్రంలో భోగిమంటల్లో కరెంటు బిల్లులు దగ్ధం చేసి నిరసన తెలియజేసిన కరెంటు తగ్గించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మండల పరిధిలోని వీరులపాడు దొడ్డ దేవరపాడు అల్లూరు జుజ్జూరు వి అన్నవరం గ్రామాల్లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి చాట్ల రవి, పల్లి కంటి బాబు గుంజి వీరయ్య, శ్రీనివాసరావు, సుందర్ రావు, లాల్, అహ్మద్ గౌస్ నిరసన తెలియజేసిన వారిలో ఉన్నారు.
