ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి

May 12,2024 18:56
  • జెసి సంపత్‌ కుమార్‌

ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సంపత్‌ కుమార్‌ అన్నారు. స్థానిక లక్కిరెడ్డి అనిమిరెడ్డి క్రీడా ప్రాంగణంలో సోమవారం జరిగే ఎన్నికలకు సంబంధించిన సిబ్బందికి ఆదివారం పలు సూచనలు సలహాలు ఇచ్చి మెటీరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మైలవరం నియోజకవర్గంలో గతంలో 82 శాతం పోలింగ్‌ నమోదవగా ప్రస్తుతం 90శాతం పెరిగేలా లక్ష్యంగా ఏర్పాట్లు చేశామన్నారు. నియోజకవర్గంలో 296 పోలింగ్‌ కేంద్రాలుండగా ఒక్కొక్క కేంద్రంలో పీవోస్‌ 1, ఏపీవోస్‌ 1, ఓపిలు నలుగురు ఉంటారన్నారు,. 41 లొకేషన్స్‌లో 124 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని అన్నారు. అలాంటి చోట సీఆర్పీఎఫ్‌ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్‌, వెబ్‌ కాస్టింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఏమి జరిగినా వెంటనే సమాచారం పై అధికారులకు అందుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,200 పోలింగ్‌ కేంద్రాలల్లో 13 వేల మంది సిబ్బంది, 700 మంది మైక్రో అబ్జర్వర్‌, 400 మంది వీడియో గ్రాఫర్స్‌ను వినియోగిస్తున్నామన్నారు. ఎండల నుండి రక్షణ పొందేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామన్నారు.

➡️