ట్రాక్టర్‌ బోల్తా… రైతు మృతి

Jun 9,2024 21:41

ప్రజాశక్తి – తిరువూరు : ట్రాక్టర్‌ బోల్తా పడి కౌలు రైతు మృతి చెందిన సంఘటన తిరువూరు మండలం, ముష్టికుంట్ల సమీపంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం కొమ్మిరెడ్డిపల్లి శివారు గొల్లగూడెం గ్రామానికి చెందిన బట్టు శ్రీనివాసరావు (37) కౌలు తీస్తుకున్న పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్ని ఇంటికి వెళుతుండగా ముష్టికుంట్ల సమీపంలోని ఎన్‌ ఎస్పీ కాలులో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడక్కడికే మృతి చెందాడు. సమాచారం తెలుసుకునే గ్రామస్తులు జెసిబి సహాయంతో ట్రాక్టర్‌ను, మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

➡️