భవన నిర్మాణ కార్మికులకు సాయం

Feb 10,2024 12:36 #ntr district
Financial assistance to construction workers

 25 కేజీల బియ్యం, 1000 రూపాయలు ఆర్థిక సాయం

ప్రజాశక్తి: మండలంలో జుజ్జూరు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో షేక్ రాబి మృతి చెందారు. ఆదమలి సీనియర్ తాపీ మేస్త్రి గా చాలాకాలం పనిచేసి ఉన్నారు ఆయన గత పది సంవత్సరాల క్రితం మృతి చెంది ఉన్నారు. ఈమెకు ఇద్దరు కుమారులు షేక్ మీరా హుస్సేన్ షేక్ ఖాసిం సైదా ఇరువురు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. వారి తల్లి రాబి అనారోగ్యంతో మృతి చెందడంతో మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు జుజ్జూరు ఎంపీటీసీ 1 షేక్ నాగుల్ మీరా 25 కేజీల బియ్యం వారి కుటుంబానికి అందజేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తమ్మిశెట్టి పుల్లయ్య 1000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి లాల్ అహ్మద్ గౌస్ భవన నిర్మాణ కార్మికులు కొమ్ము తిరుపతిరావు షేక్ రఫీ షేక్ ఖాదర్ తమ్మిశెట్టి సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  సి ఐ టి యు నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు పని దినాలు కోల్పోవడంతో ఆర్థికంగా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుండి రావలసిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిలుపుదల చేయటం వల్ల అనేక కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల ఆదుకోవాలని కార్మిక సంఘాలు నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

➡️