జెఇఇలో ఫిట్జీకి ఫస్ట్‌ ర్యాంక్‌

Jun 9,2024 21:35

ప్రజాశక్తి. – ఎడ్యుకేషన్‌ : ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో జేఈఈ అడ్వాన్స్డ్‌ 2024 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ర్యాంక్‌ వరించింది. ఈ సందర్భంగా పిట్జీ క్యాంపస్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్‌ పిన్నెపు రమేష్‌ బాబు వివరాలను వెల్లడించారు. తమ కళాశాల విద్యార్ధి కోడూరు తేజేశ్వర్‌ జేఈఈ ఫలితాల్లో ఆలిండియా 8వ ర్యాంక్‌ సాధించడం గర్వకారణం అని కొనియాడారు. ఈ ఫలితాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ కు మొదటి ర్యాంకు రావడం శుభపరిణామని సంతోషం వ్యక్తం చేశారు.దాదాపుగా 300మందికి పైగా విద్యార్థులు ఈ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి ఐఐటీలో ప్రవేశం పొందారని తెలియజేశారు.ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో కూడా తమ విద్యార్థులు 100శాతం విజయం సాధించారని తెలిపారు. భవిష్యత్తు తరాలు విద్యార్థులకు ఈ విజయాలు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. క్రమశిక్షణతో పాటు ప్రత్యేకమైన దష్టి ఉత్తమశిక్షణ విద్యార్థులకు అందించి ప్రపంచ స్థాయిలో రాణించేందుకు కషి చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు , అధ్యాపక బందానికి, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్ధి తేజేశ్వర్‌ మాట్లాడుతూ తమది సామాన్యమైన కుటుంబమని తమ కళాశాల కృషితో ఆలిండియా 8వ ర్యాంకు సాధించడం నాకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రత్యేకమైన విద్యాబోధన విధానంతో పాటు శారీరక మానసిక, శారీరకంగాను చైతన్య పరుస్తూ విద్యను దించడంతో ఈ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్యాంపస్‌ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, బాణసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.ఉత్తమ ర్యాంకులుజెఇఇ అడ్వాన్స్‌ 2024 ప్రవేశ పరీక్షా ఫలితాలలో మొగల్‌రాజపురంలోని శారద విద్యా సంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని శారద విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ వై. రమేష్‌బాబు తెలిపారు. మొగల్‌రాజ పురంలోని శారద విద్యా సంస్థల కాన్ఫరెన్స్‌హాల్‌లో ఆదివారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శారద విద్యా సంస్థలకు చెందిన సీనియర్‌ ఎంపిసి విద్యార్థులు జాతీయ స్థాయిలో వివిధ కేటగిరిలలో ఎ.సంపత్‌ 729వ ర్యాంకు, కె.నాగరాహుల్‌ ధృవ 3670వ ర్యాంకు, ఎం.నాగలక్ష్మీ లలితాదేవి 5366వ ర్యాంకు సాధించారని తెలిపారు. మరో విద్యార్థిని పి.పవిత్ర 5544, పి.వెంకట ఫణికుమార్‌ 7689వ ర్యాంకు సాధించి సత్తా చటారని తెలిపారు. తమ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు జెఇఇ అడ్వాన్స్‌డ్‌ 2024 ప్రవేశ పరీక్షలో అత్యధిక సీట్లు సాధించే ర్యాంకులు సాధించారని, ఇంత మంచి ఫలితాలను సాధించడం తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ర్యాంకులు సాధించడానికి చక్కని ప్రణాళిక, అధ్యాపకులు సలహాలు, సూచనలు, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందని అన్నారు. శారద విద్యా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై.శారదాదేవి మాట్లాడుతూ జెఇఇ అడ్వాన్స్‌డ్‌ 2024 ప్రవేశ పరీక్షా ఫలితాలలో మంచి ర్యాంకులు సాధించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తమ విద్యా సంస్లలో చదివే ప్రతి విద్యార్థి కూడా అన్ని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలలో కూడా ఉత్తమ ర్యాంకులు సాధించారని అన్నారు. పరిమితమైన విద్యార్థులతో ఇంత మంచి రిజల్ట్స్‌ సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల అడ్వైజర్‌ ఈయస్‌ఆర్‌కె ప్రసాద్‌, జనరల్‌ మేనేజర్‌ జి.వి.రావు అభినందించారు.శ్రీ చైతన్య విజయకేతనం ప్రజాశక్తి – హెల్త్‌ యూనివర్శిటీ : జెఇఇ అడ్వాన్స్‌ 2024 ప్రవేశ పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల విజయవాడ విద్యార్థులు ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరిలో జాతీయ స్థాయిలో టాప్‌ ర్యాంకులు సాధించారని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్‌ ఏజిఎం మద్దినేని మురళీకృష్ణ అన్నారు. ఎం.జి.రోడ్డులోని శ్రీ చైతన్య కళాశాలలో ఆదివారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్‌ క్యాటగిరిలో పదిలోపు 4, 5, 6, 9, 10 ర్యాంకులు సాధించారని తెలిపారు. శ్రీ చైతన్య విజయవాడ విభాగం నుండి ఆలిండియా ఓపెన్‌ కేటగిరిలో 100వ ర్యాంకులోపు నలుగురు విద్యార్థులు ఎన్‌.సిద్దార్థ రెడ్డి 34వ ర్యాంకు, ఎస్‌.జ్యోతిరాదిత్య 55వ ర్యాంకు సాధించారన్నారు. పి.వి.ఎస్‌.సాయి మోహిత్‌ 71వ ర్యాంకు, టి.వి.ఎస్‌.ఎస్‌.నాగ భూషన్‌ 100వ ర్యాంకు సాధించా రన్నారు. ఆలిండియా ఓపెన్‌ కేటగిరిలో 500లోపు 27 మంది, ఆలిండియా క్యాటగిరి 1000లోపు 46 మంది విద్యార్థులు టాప్‌ ర్యాంకులు సాధించారన్నారు. ఇటువంటి విజయాల శ్రీ చైతన్య విద్యా సంస్థలకు తప్ప ఎవరికీ రాలేదన్నారు. ఈ విజయానికి కారణం శ్రీ చైతన్యలోని సూపర్‌ -120, సి-ఐపిఎల్‌, అండ్‌ ఐపిల్‌ ఐసి ప్రోగ్రామ్‌ వల్లనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు.

➡️