ప్రజాశక్తి-గంపలగూడెం: ప్రతి ఒక్కరు గాంధీ మార్గాన్ని అవలంబించి, శాంతిని కాపాడాలని గంపలగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎడ్లపల్లి రామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయము నందు గాంధీజీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ, గాంధేయ మార్గాన్ని విడిచి, గాంధీ మార్గాన్ని అవలంబించాలని కోరారు. నాటి గాంధీ ఈ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తమ్మారపు ఆదినారాయణ, టౌన్ పార్టీ అధ్యక్షురాలు వేల్పుల పాపమ్మ, మరి ఇది నవనీతం, దుబ్బాకు రాము తదితరులు పాల్గొన్నారు.