రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీని కలిసిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ కమిటీ

Jun 10,2024 21:52

ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ను కలిసి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎం.డి.జాని పాషా మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల బృందం, ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ ప్రధానంగా ప్రమోషన్‌ చానెల్స్‌ గురించి, ప్రమోషన్‌తో పాటు పేస్కేల్‌ సవరణ చేయాలని అభ్యర్థిస్తూ తదితర అంశాలతో కూడిన ప్రధాన అంశాల గురించి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రోజా ప్రకాష్‌, సమాచార కార్యదర్శి యన్‌.రాజేష్‌ బాబు,రాష్ట్ర సమన్వయకర్త ఎం.శశిధర్‌,రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.నవీన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️