సిపిఎం డిమాండ్
ప్రజాశక్తి-నందిగామ : ఈరోజు సిపిఎం నందిగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలోనందిగామ గాంధీ సెంటర్లో కరెంట్ బిల్లులు భోగిమంటల్లో దగ్నం నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కే గోపాల్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా కరెంట్ చార్జీలు పెంచబోము అని చెప్పిన ముఖ్యమంత్రి ఆరు నెలల కాలంలోనే ట్రూ అప్ చార్జీల పేరుతో 17 వేల కోట్ల చార్జీల పేరుతో భారం ప్రజల మీద మోపడం జరిగిందని అన్నారు. కావున వెంటనే ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని, 16 వేల కోట్ల భారాలు వెనక తీసుకోవాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించాలని తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులకు ఎస్సీ ఎస్టీలు కరెంట్ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆదానితో చేసుకున్న సోలార్ సెకి ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు, సయ్యద్ ఖాసిం, కర్రి వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, చెరుకుమల్లి పిచ్చయ్య, ఏడుకొండలు, బాబు, లాజర్, హస్సన్ తదితరులు పాల్గొన్నారు.
