కొత్త రేడియో జాకీతో వినూత్న కార్యక్రమాలు

Jun 10,2024 21:53
  • బెజవాడ టాకీస్‌ పేరుతో ప్రత్యెక ఈవెంట్‌

రెడ్‌ ఎఫ్‌ఎమ్‌ తమ వినూత్న కార్యక్రమాల్లో మరో మెట్టుకెక్కుతూ, ప్రత్యేకంగా ఎంపిక చేసిన రెడ్‌ ఎఫ్‌ఎమ్‌ ఫాన్‌ క్లబ్‌ శ్రోతలచే కొత్త ఆర్జేను పరిచయం చేస్తుందని ప్రోగ్రామ్‌ హెడ్‌ ఆదిల్‌ భాషా తెలిపారు. నగరంలోని రెడ్‌ ఎఫ్‌.ఎం.కార్యాలయంలో సోమవారం నూతన రేడియో జాకీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా నూతన ఆర్జే అందించే సమాచారం వినూత్నంగా, ఆసక్తికరంగా ఉండబోతుందని అన్నారు. కొత్త ఆర్జే పేరు బెజవాడ రామ్‌. అని ఇతను రెడ్‌ ఎఫ్‌ఎమ్‌ 93.5 లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ”బెజవాడ టాకీస్‌” షో చేయబోతున్నారు అని తెలిపారు.. ఈ కొత్త ఆర్జే వినోదాన్ని మరింత హాస్యంగా అందరికీ దగ్గర చేయబోతున్నారు అని తెలిపారు. ‘మేము శ్రోతల అభిరుచులను, వారి అభిప్రాయాలను మన్నిస్తూ ఈ కొత్త ఆర్జేను పరిచయం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఫాన్‌ క్లబ్‌ సభ్యులు తమ ఆదరణతో, ఉత్తేజంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. కొత్త ఆర్జే బెజవాడ రామ్‌ శ్రోతలను అలరిస్తూ, ప్రత్యేక కార్యక్రమాలు, ఆత్మీయ సంఘటనలు నిర్వహించబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రోతలకు స్టేషన్‌ హెడ్‌ క్రాంతి కుమార్‌ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

➡️