ఆర్‌యుబి పనులు పరిశీలన

Jun 11,2024 23:08
  • త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఉమా సూచన

విజయవాడ : మధురానగర్‌లోని ఆర్‌యుబి పనులను సెంట్రల్‌ ఎంఎల్‌ఎ బొండా ఉమామహేశ్వరరావు మంగళవారం అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్‌ నియోజక వర్గంలో మధురానగర్‌ ఆర్‌యుబిని తాను మొదలు పెడితే దానిని పూర్తి చేయలేని అసమర్థ గత వైసిపిది అన్నారు. మధురానగర్‌ దేవినగర్‌ ఫ్లైఓవర్‌ను పూర్తి చేసి ఇటు నుంచి అటు పనులకు, స్కూళ్లకు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉండేలా చేసింది టిడిపి ప్రభుత్వం అని తాను ఎంఎల్‌ఎగా ఉన్న సమయంలో అని 2019లో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో తాను శాసనసభ్యులుగా మధురానగర్‌ వాసుల చిరకాల స్వప్నమైన డబల్‌ లైన్‌ ఆర్‌యుబిని ఆనాడు మంజూరు చేయించారన్నారు. తాను ఎంఎల్‌ఎగా ఉన్న సమయంలోనే సింగ్‌నగర్‌ బుడమేరు కింద ఆర్‌యుబిని 9 నెలల్లో మంజూరు చేయించడమే కాకుండా పనులను కూడా పూర్తి చేశామని తెలిపారు. 2019 జనవరిలో శంకుస్థాపన చేసి అప్రోచ్‌ రోడ్డులకు రూ.18 కోట్లు నిధులను మంజూరు చేసి రైల్వే పార్ట్‌లో వారి నుండి అప్రూవల్‌ చేయించి పర్మిషన్లు తెచ్చి వర్క్‌ మొదలుపెట్టి 9 నెలల్లో పూర్తి కావలసిన ఈ డబల్‌ లైన్‌ ఆర్‌యుబిని గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం జగన్మోహన్‌ రెడ్డి, స్థానిక ఎంఎల్‌ఎ అసమర్థత వల్ల ఇంతవరకు పూర్తి కాలేదని అన్నారు. తాత్కాలిక మరమ్మత్తులతో ట్రైలర్‌ను జరుపుతుందని, 20 రోజులు పనులు ఉన్నాయని ఈ సందర్భంగా మున్సిపల్‌ అధికారులతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులు డ్రైన్‌లు, లైట్స్‌, పెయింటింగ్‌, పిల్లర్స్‌ ప్లాస్టింగ్‌ వంటి పనులు త్వరగా పూర్తిచేయాలని మున్సిపల్‌ ఎఇ శ్రీనివాస్‌తో మాట్లాడి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఉమా వెంట కార్పొరేటర్‌ వీరమాచినేని లలిత, డివిజన్‌ అధ్యక్షులు పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, నెక్కంటి ప్రసాద్‌, సూరి, సింగం వెంకన్న, ఆత్కూరి జానకి అరవింద, కొండల్‌ రావు, సిహెచ్‌.రత్తయ్య, సత్యనారాయణ, దుర్గాప్రసాద్‌, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️