ప్రమాణ స్వీకార సభ ప్రాంగణం పరిశీలన

Jun 11,2024 22:51

నాయకులు, అధికారులకు ఎంపి చిన్ని సలహాలు, సూచనలు

విజయవాడ : టిడిపి అధినేత, ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయబోయే ప్రమాణ స్వీకార మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్‌ (చిన్ని) తెలిపారు. గన్నవరం మండలం కేసరపల్లి మేధ టవర్స్‌ పక్కన ఉన్న 17 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవ పనులు, సభా వేదికను మంగళవారం కేశినేని శివనాథ్‌, ఎంఎల్‌సి మంతెన వెంకట సత్యనారాయణరాజుతో కలిసి పర్యవేక్షించారు. స్టేజ్‌ ముందు ఏర్పాటు చేసిన వివిఐపి, విఐపి గ్యాలరీలను పరిశీలించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు తాగునీటి సప్లై, పారిశుద్ధ్య నిర్వహణ గురించి అధికారులతో మాట్లాడి ఆ వివరాలు తెలుసుకున్నారు. ఇక ప్రోటోకాల్‌ పరంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎదురవకుండా చూడాలని పోలీసులు ఉన్నతాధికారులకు సూచించారు. సభా ప్రాంగణం మొత్తం తిరిగి జరుగుతున్న పనులను పరిశీలించటంతోపాటు, వివిధ రాష్ట్రాల నుంచి రాబోతున్న నాయకుల కోసం ఏర్పాటు చేసిన వసతి సదుపాయలను కూడా పరిశీలించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం ఒక పండుగ వాతావరణంలా జరగాలని నాయకులకు, అధికారులకు సూచించి… అందుకు కావాల్సిన విధంగా ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని కోరారు.

➡️