గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో అవినీతిపై విచారణ

May 25,2024 20:46

జూపూడిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి జరిగినట్లుగా ఉపాధి హామీ కూలీలు కొంతమంది ఆరోపించడంతో, దీనిపై విచారణ జరిపి ఈ నెల 26వ తేదీ నాటికి డ్రామా కార్యాలయంలో నివేదిక సమర్పించాలని ద్వారా ప్రాజెక్టు డైరెక్టర్‌ జె.సునీత ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలోని డ్వాక్రా భవన్లో శనివారం జిల్లా అంబుడ్స్‌ మెన్‌ ఇమ్మానియేలు రాజు, విజయవాడ క్లస్టర్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వి వెంకటేశ్వరరావు విచారణ చేపట్టారు. ఉపాధి హామీ కూలీలు మేట్స్‌ సిబ్బంది విచారణకు హాజరయ్యారు. జూపూడిలోని ఉపాధి హామీ పనుల్లో అవినీతిని ప్రశ్నిస్తున్న వారిపై అధికారులు దుర్భాషలు ఆడుతున్నారంటూ ఉపాధి హామీ కూలీలు ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై ఆరోపణలు చేశారు. వందమంది పనిచేస్తే 300 మందికి హాజరు వేస్తున్నట్టు కూలీలు ఆరోపిస్తున్నారు. విచారణ చేపట్టిన అధికారులు ఇరువురి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. నివేదికను జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌కు సమర్పిస్తామని తెలిపారు.

➡️