కుదప గ్రామానికి కృష్ణా నీరు ఇవ్వాలి

Nov 29,2024 13:29 #ntr district

ప్రజాశక్తి – రెడ్డిగూడెం: కుదప గ్రామానికి కృష్ణా వాటర్ వస్తున్నప్పటికీ గ్రామం అంతటికీ కృష్ణా వాటర్ సరఫరా చేయడం లేదని, కుదప గ్రామానికి చెందిన టిడిపి నాయకులు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా కు మెమోరాండం సమర్పించారు. కుదప గ్రామం నుండి ఏ కొండూరుకి కృష్ణా వాటర్ సప్లై చేయడం కోసం జరుగుతున్న పనులు పరిశీలించడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ కి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. తోలుకోడు గ్రామం నుండి ఇక్కడకు వాటర్ వచ్చి సంపు నిర్మించినా గాని పూర్తిస్థాయిలో తాగునీటికి గ్రామం లో కృష్ణా వాటర్ సప్లై చేయటం లేదని తెలిపారు. గ్రామంలో ఎలాంటి చెడు అలవాట్లు లేని వ్యక్తులు సహితం కిడ్నీ బాధితులు అవుతున్నారు, గ్రామంలో మంచినీళ్లు బోరులో ఫ్లోరైడ్ అధికంగా ఉందని గతంలో అధికారులు తెలియజేశారు, దీంతో గ్రామ ప్రజలు కాళ్లు చేతులు వంకర్లు పోవడం కిడ్నీలు పాడైయ్యాయి. ఈ విషయాన్ని మాజీ ఎంపీపీ టీడీపీ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శివిజయబాబు కలెక్టర్ దృష్టికి తెచ్చి వివరించారు. ఈ విషయం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు దృష్టిలో కూడా ఉందని ఎమ్మెల్యే కూడా అన్ని రకాలుగా సహకరిస్తానని అధికార యంత్రంగం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని సహకరించాలని కలెక్టర్ ని కోరారు. ఈ గ్రామానికి వాటర్ సరఫరా చేసిన తర్వాతే మిగిలిన గ్రామాలకు వాటర్ తీసుకెళ్తామని నాయకులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బలగాని ఏడుకొండలు, మురళి,పారా రాజా,శ్రీనివాసరావు, రావి శ్రీనివాసరావు చీపు కృష్ణ, జక్కుల సుందర్రావు, నారాయణ వరపు, రామారావు, ప్రసాద్ మూడు,ఏకుల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️