దుర్గమ్మను దర్శించుకున్న పన్నీర్‌ సెల్వం

Jun 11,2024 23:05

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకునేందుకు తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం మంగళవారం శ్రీ అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి కెఎస్‌.రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీఅమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వాహణాధికారి వారు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఈ సందర్బంగా వీరికి ఆలయ ఇఒ ఆలయ ప్రాశస్యతను, పండుగల విశేషములను గురించి తెలియజేశారు.

➡️