నగరంలో ప్రజలకు కష్టాలే మిగిలాయి

May 25,2024 20:57
  • ఇసుక లేక కార్మికుల రోడ్డున పడ్డారు
  • ఓట్ల కోసం కోట్ల ఖర్చు చేశారు
  • దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు సింగ్‌ నగర్‌ రాజీవ్‌ నగర్‌లో పర్యటించారు. తమకు మద్దతు తెలిపిన ప్రజలకు ఇంటింటికి వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ముగిశాయని ప్రజలకు కష్టాలు మిగిలాయని అన్నారు. ప్రధాన పార్టీలైన బిజెపి, టిడిపి, వైసిపి ఓట్ల కోసం ఎన్నో నాటకాలు ఆడారన్నారు. కోట్ల రూపాయల ఖర్చు చేసి ఓటర్లను మభ్యపెట్టారన్నారు. ఇసుక రేటు పెరిగి ఇసుక దొరకడం లేదని, కార్మికులకు పని లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చేతి వత్తుల వారికి పని లేక వ్యాపార అభివృద్ధి జరగక ప్రజలు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల్లో పంచడానికి డబ్బులున్నాయి కానీ ప్రభుత్వం ద్వారా కార్మికులకు పని చూపించలేక పోవడానికి కారణం తెలియటం లేదన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిందని రాష్ట్రంలో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని నగరంలో ఉపాధి పథకం పెట్టాలని కార్మికులను ఆదుకోవాలని అన్నారు. రాజకీయాల్లో హింస గందరగోళం ఏర్పడ్డాయని, కోట్లలో జరుగుతున్న బెట్టింగులతో చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలో కలుషితమైన నీరు వస్తుందని దానిని గురించి పట్టించుకోనే అధికారులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం ప్రజల కోసం పోరాటం చేస్తుందని ప్రజా సమస్యలు తెలుసుకొని వారికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి.రమణరావు అధ్యక్షులు కె.దుర్గారావు నాయకులు ఎస్‌కె పేరు, నాగేశ్వరరావు, రాంబాబు, సాంబిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.మరమ్మతులకు నోచని చెత్త బండ్లుడివిజన్లలో పర్యటిస్తున్న బాబూరావు చెత్త తొలగింపు బళ్లు పూర్తిగా దెబ్బతినడం గమనించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ చెత్త బండ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి, చక్రాలు ఊడిపోతున్నాయి. రేకులు దెబ్బతిన్నాయన్నారు. తొలగించిన చెత్త మళ్లీ రోడ్లపై పడిపోతుందని అన్నారు. కార్మికులు బళ్ళు లాగలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ సర్వేక్షన్‌ పథకాల్లో జాతీయస్థాయిలో అనేక అవార్డులు పొందిన నగరపాలక సంస్థ పారిశుధ్య వాహనాలు, బండ్లు రిపేర్లను సైతం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. నగరపాలక సంస్థ అధికారులు దృష్టికి అనేకసార్లు తీసుకువెళ్లినా, పెడచెవిన పెడుతున్నారు. రిపేర్ల భారం పారిశుధ్య కార్మికులపై పడుతుందన్నారు. వేలాది రూపాయలు రిపేర్లు కోసం కార్మికులు ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మూలబడిన వాహనాలు, దెబ్బతిన్న బళ్ళు గుర్తించి తక్షణమే మరమ్మతులు చేయించాలని అన్నారు. ఇందుకు నిధులు కేటాయించాలన్నారు. అవసరమైన కొత్త బళ్లు సేకరించాలి. కార్మికులపై భారం లేకుండా చేయాలి. పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుచేయాలి.

➡️