సిబిఎస్‌సి పదో తరగతి ఫలితాలలోఎన్‌.ఎస్‌.ఎం. స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

May 13,2024 22:55

ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : సిబిఎస్‌సి పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నగరంలోని ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని స్కూల్‌ ప్రిన్సిపాల్‌బ్రదర్‌ రాయప్ప రెడ్డి తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు సోమవారం పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. తమపాఠశాల నుండి మొత్తం 269 మంది విద్యార్థులు హాజరుకాగా 90 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. తమ విద్యార్థిని లాస్య 500 మార్కులకుగానూ 488 మార్కులు సాధించి పాఠశాల ప్రథమ స్థానం సాధించగా, మరో విద్యార్థి సాయి రోహిత్‌ 486 మార్కులతో ద్వితీయ స్థానం సాధించాడని తెలిపారు. శిరిగిరి వెంకట సాయి రామ్‌ చరణ్‌ 500 మార్కులకుగాను 481 మార్కులు సాధించి తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను స్కూల్‌ కరస్పాండెంట్‌ రెవరెంట్‌ బ్రదర్‌ మాంటీ, వైస్‌ ప్రిన్సిపాల్‌ బ్రదర్‌ బాలారెడ్డి అభినందించారు.

➡️