సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మత్తు

Sep 29,2024 12:08 #ntr district

ప్రజాశక్తి-వీరులపాడు మండలం : జుజ్జూరు మరియు చట్టనవరం గ్రామాల మధ్య రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో తెలుగుదేశం నాయకులు గురజాల అజయ్ కుమార్ మరమ్మతులు చేపట్టారు. ఆదివారం నాడు జుజ్జూరు చట్టనవరం గ్రామాల రోడ్డు మరమ్మత్తు కార్యక్రమాన్ని గురుజాల అజయ్ కుమార్ సొంత ఖర్చులతో చేపట్టడంతో  పలు గ్రామాల రైతులు, ప్రజలు అభినందనలు తెలిపారు. ఈ రోడ్డు మరమ్మత్తు కోసం 40 టన్నుల కషర్ మెటల్ 30 టన్నుల రబీసు ఆరు ట్రాక్టర్ల మెటల్ గ్రావెల్ జెసిపి సాయంతో
మరమ్మతులు చేపట్టారు సుమారుగా ఈ రోడ్డు మరవత్తు కోసం 50 వేల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ మరమత్తు కార్యక్రమంలో చట్టం నగరం గ్రామానికి చెందిన కోట భారత్ కుమార్ పాల్గొన్నారు.

➡️