ఏపీ ఇఎపిసెట్‌ – 2024 ఫలితాలలో …శ్రీ చైతన్య విద్యా సంస్థల విజయభేరి

Jun 11,2024 23:04

 ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : ఎపిఇఎపి సెట్‌ – 2024 ప్రవేశ పరీక్షలో విజయవాడ శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధించారని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్‌ ఎజిఎం మద్దినేని మురళీకృష్ణ తెలిపారు ఎం.జి.రోడ్డులోని శ్రీ చైతన్య కళాశాలలో మంగళవారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యార్థులు అగ్రికల్చర్‌ విభాగంలో స్టేట్‌ 2వ ర్యాంకుతో పాటు టాప్‌ ర్యాంకులు సాధించారన్నారు. పి.దివ్య తేజ రెండో ర్యాంకు, వి.ముకేష్‌ చౌదరి మూడో ర్యాంకు, పి.సాత్విక్‌ 4వ ర్యాంకు, పి.ప్రణీత 5వ ర్యాంకు, జి.భాను తేజ సాయి 6వ ర్యాంకు, సాధించారని తెలిపారు. ఇంజనీరింగ్‌ ఫలితాలలో పి.సతీష్‌ రెడ్డి 4వ ర్యాంకు, జి.లేఖ హర్షా7వ ర్యాంకు సాధించారన్నారు. శ్రీ చైతన్య విద్యార్థులు విజయవాడ జోన్‌ నుండి ఇంజనీరింగ్‌ విభాగంలో 10లోపు రెండు ర్యాంకులు, 50 లోపు 20 ర్యాంకులు, 100లోపు 29 ర్యాంకులు సాధించారని తెలిపారు. అగ్రికల్చరల్‌ విభాగంలో 10లోప 5 ర్యాంకులు, 50 లోపు 17 ర్యాంకులు, 100లోపు 31 ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈవిజయానికి శ్రీ చైతన్య విద్యా సంస్థలు అనుసరిస్తున్న ఇంజనీరింగ్‌ ఎన్‌పిఎల్‌, నియాన్‌, మెడికల్‌ విభాగంలో ఎంపిఎల్‌ అండ్‌ మెఇకాన్‌ ప్రోగ్రామ్‌ల వల్లనే సాధ్యమైందని తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులను అభినందించారు.

➡️