విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

May 25,2024 20:51

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : విద్యార్థులు పారిశ్రామికరంగానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే చక్కని ఉపాధి అవకాశాలను పొందుతారని గ్లోబల్‌ స్టార్‌ సంస్థ మేనేజర్‌ ప్రవలిక అన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్లేస్‌మెంట్‌ అండ్‌ గైడెన్స్‌ సెల్‌ ఆధ్వర్యంలో క్యాంపస్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. గ్లోబల్‌ స్టార్‌ సంస్థ నిర్వహించిన ఈ డ్రైవ్‌లో పలు సంస్థలకు తొలి దశలో 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డ్రైవ్‌ను ప్రారంభించిన ప్రవలిక మాట్లాడుతూ విద్యార్థులు తమతమ కోర్సులకు సంబంధించిన విజ్ఞానంతో పాటుగా తమతమ రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులను, ప్రపంచ వ్యాపితంగా చోటు చేసుకుంటున్న నూతన అంశాలపై పట్టు సాధించాలన్నారు. విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగినప్పుడే అనుకున్న విజయాలను సాధిస్తారని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్స్‌ డాక్టర్‌ ఎం వెంకటేశ్వరరావు, పీఎల్‌ రమేష్‌, అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ రమేష్‌ పాల్గొన్నారు.

➡️