ధన్యవాదములు

May 16,2024 12:39 #ntr district

సిపిఎంకు ఓటు వేసేందుకు కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదములు
టిడిపి వైసిపి ఒకటై పట్టపగలే డబ్బులు పంపిణీ పట్టించుకోని ప్రభుత్వం యంత్రాంగం
ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు
ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ముగియడంతో టిడిపి, వైసిపి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు డివిజన్ స్థాయి ఓట్లు లెక్కల్లో నిమగ్నమయ్యారు. సిపిఎం సెంట్రల్ సిటీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు గురువారం శాంతినగర్ 62 డివిజన్లో తమకు ఓటు వేసేందుకు సహకరించిన ప్రజలకు నాయకులకు కార్యకర్తలను కలిసి వారికి ధన్యవాదములు తెలియజేసినారు. ఈ సందర్భంగా చిగురుపాటి బాబురావు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇండియా కూటమి బలపరిచిన సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి చిగురుపాటి బాబురావు విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు. టిడిపి, వైసిపి సార్వత్రిక ఎన్నికలలో ఒకరిపై ఒకరు గొడవలు పడి ఘర్షణలు పడి ఎలక్షన్ టైం లో రెండు పార్టీలు కలిసిపోయాయి. డబ్బులు పంచడం కోసం ఒప్పందలు కుదుర్చుకున్నారు. ఎలక్షన్ లో డబ్బులు రాత్రిపూట గతంలో పంచేవారు కానీ ఇప్పుడు పట్టపగలే డబ్బులు పంపిణీ చేసినారు. ఓటర్లను ప్రభావితం చేశారు. దీనిపై యంత్రాంగం మొత్తం కళ్ళు మూసుకుని ఉండటంతో ధనబలం రాజ్యమేలింది. ప్రజల మాత్రం సిపిఎం అభ్యర్థికి ఓట్లు వేసి కమ్యూనిస్టులకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదములు తెలియజేశారు. రాబోవు ప్రభుత్వం ప్రజలపై భారం మోపకుండా ప్రజా సమస్యల తీర్చాలని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అమ్మఒడి, విద్యా దీవెన, తదితర పథకాలు ఎలక్షన్ అవగానే డబ్బులు పంపిణీ చేస్తామని చెప్పి వాటి గురించి పట్టించకపోవడం దారుణం అన్నారు. పథకాలు ఇవ్వటానికి డబ్బులు ఇవ్వలేవు గాని ఓటర్లకు డబ్బులు పంచటానికి లక్షలాది రూపాయలు పంపిణీ చేశారు అన్నారు. వేసవికాలంలో కనీసం మంచినీళ్లు సమస్య కూడా పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. నిత్యం ప్రజలలో అందుబాటులో ఉండే వ్యక్తులు కమ్యూనిస్టులని ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీ అని అన్నారు. ధన రాజ్యంలో ప్రజలు చైతన్యం అవ్వాలని సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలను చైతన్యం పరుస్తామని ప్రజలకు అండదండలుగా ఉంటామని పిలిస్తే పలుకుతామని అదేవిధంగా సిపిఎంకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సిటీ కార్యదర్శి బి రమణ రావు, శాంతినగర్ డివిజన్ ఇంచార్జ్ చింతల శ్రీనివాస్, సింగ్ నగర్ ఇన్చార్జ్ నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

➡️