మొక్కులు తీర్చుకున్న జనసేన నాయకులు 

Jun 8,2024 13:31 #ntr district

ప్రజాశక్తి – రెడ్డిగూడెం : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు జనసేనపార్టీ అభ్యర్థులు అందరూ ఘన విజయం సాధించిన సందర్భంగా రెడ్డిగూడెం మండల సంయుక్త కార్యదర్శి షేక్ సుభానీ మరియు రెడ్డికుంట గ్రామ కమిటీ సభ్యులు జవ్వాజి మహిమ కలిసి తమ మొక్కుబడిని కుదపలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం నందు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల అధ్యక్షులు చాపమడుగు కాంతారావు,తోట క్రాంతిబాబు, పడిసాల రమేష్,గొల్లపల్లి కొండలరావు,తాడిముత్తారావు,గూండ్రుఆదర్శ్, చాపలమడుగు ప్రవీణ్,మోదుగు ప్రవీణ్ పాల్గొన్నారు.

➡️