రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Jun 9,2024 21:38
  • వీరిలో ఒకరి పరిస్థితి విషమం

ప్రజాశక్తి – మైలవరం : బస్సును ఓవర్‌ టేక్‌ చేయ బోయి ఎదురుగా వస్తున్న ఆటోను ద్విచక్ర వాహనం ఢకొీన డంతో ముగ్గురికి గాయాల య్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం చాట్రాయి మండలం చనుపబండకు చెందిన తానంకి దేవ కుమారి, విస్సంపల్లి కుమారి, నూజివీడుకు చెందిన పెనుమచ్చ సీతమ్మ, మరొక ఇద్దరు జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో శుభకార్యం సందర్భంగా వంట నిమిత్తం కూరగాయలు పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా మైలవరంలోని విజయవాడ రోడ్డు సుధాకర్‌ రెడ్డి హాస్పిటల్‌ వద్ద విసన్నపేట మండలం పుట్రెలకు చెందిన పాతనబోయిన నాగేశ్వరరావు ద్విచక్ర వాహనంపై కొండపల్లి వైపు వెళ్తూ ఎదురు ఉన్న బస్సును ఓవర్టేక్‌ చేయబోయి ఆటోను ఢకొీన్నాడు. ఈ ఘటనలో తానంకి దేవ కుమారి తీవ్రంగా, గాయపడ్డారు. సీతమ్మ, కుమారులకు స్వల్ప గాయాలయ్యాయి.క్షతగాత్రులను మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తానంకి దేవ కుమారుని 108 వాహనంలో విజయవాడ తరలించారు.

➡️