ట్రూ ఆఫ్ ఛార్జీలను ఎత్తివేయాలి

Jan 13,2025 10:53 #ntr district

ప్రజాశక్తి-కృష్ణలంక : పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, ట్రూ ఆఫ్ చార్జీలను ఎత్తివేయాలని 22వ డివిజన్లో సిపిఎం ఆధ్వర్యంలో వాజ శ్రీను కొట్టు దగ్గర విద్యుత్ బిల్లులను భోగిమంటల్లో దహనం చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ  మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అదనపు చార్జీలను వెయ్యమని విద్యుత్ షార్జీలను తగ్గిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి దానికి భిన్నంగా 17 వేల కోట్ల రూపాయలు భారాన్ని ప్రజలపై వేయటం సరైంది కాదని ప్రభుత్వం పునర్ ఆలోచించి పెంచిన విద్యుత్ చార్జీలను ఎత్తివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తక్షణం ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని ప్రజా ఉద్యమాలు కి సిపిఎం పార్టీ నాయకత్వం వహిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం తూర్పు సిటీ, కార్యదర్శి వర్గ సభ్యులు బత్తుల చిన్నారావు శాఖ కార్యదర్శి లు కాయల లక్ష్మణరావు, తూబాటి తాండవ కృష్ణ, వాజ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️