విద్యుత్ సర్దుబాటు చార్జీలను విరమించండి 

Jan 8,2025 12:20 #ntr district

 సిపిఎం డిమాండ్ 
ప్రజాశక్తి-వీరులపాడు : ఇటీవల ఏర్పడ్డ రాష్ట్ర నూతన ప్రభుత్వం అడ్డగోలుగా వివిధ రకాలతో విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండల సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వట్టికొండ.పార్థసారది అన్నారు. వీరులపాడు మండలంలోని వీరులపాడు గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు వట్టికొండ.పార్థసారది, కోడూరు పిచ్చేశ్వరావు మాట్లాడుతూ ట్రూ ఆఫ్ చార్జీలను 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి అదనపు భారాన్ని బిల్లులకు జమ చేయడం సరైనది కాదని అన్నారు. దీనితో సామాన్యుడు బిల్లులు కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమన్న చెప్పిన చంద్రబాబు నేడు చేస్తున్న పని ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా ఆదానితో ఒప్పందం పెట్టుకుని ఒక వైపున రైతులకు వివిధ వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తుండటం తప్పు పట్టారు. ఇటువంటి విధానాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చాట్ల రవి, మండల కమిటీ సభ్యులు గడ్డం ప్రభాకర్ మరియు వట్టి కొండ రమేష్, వట్టి కొండ.భగీరథ,అద్దంకి రవీంద్ర, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️