ప్రజాశక్తి – రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండలం, అన్నేరావుపేట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ శెట్టపల్లి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు బలగాని తిరుపతిరావుకు పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తమ గ్రామానికి మంజూరైన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని వైసీపీ లో అధికారం చెలాయించిన మండల స్థాయి నాయకులు అడ్డుకున్నారనీ ఇలాంటి వారి వలన మా ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. తమకు గ్రామ అభివృద్ధి అవసరం అని అన్నారు. తన భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.