వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉద్యాన పార్క్‌ బోర్డు ధ్వంసం

Jun 9,2024 21:43

పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్‌లో గల వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ఉద్యానవనం పేరుతో నిర్మించిన పార్కు బోర్డును కొందరు టిడిపి నాయకులు తొలగించారు. ఆదివారం ఆ పార్కుకు వైఎస్‌ఆర్‌ రాజశేఖర్‌ రెడ్డి అని ఉన్న బోర్డును ఆదివారం కొందరు తొలగించారు. ఈ తొలగింపులో 40వ డివిజన్‌ టిడిపి అధ్యక్షుడు చిన్న సుబ్బయ్య కుమారుడు నవీన్‌, మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న భవానిపురం పోలీసులు తెలిపారు.

➡️