ప్రజాశక్తి – కడప ప్రతినిధి రాష్ట్రప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సంప్రదించి వైద్యసేవలను నిరంతరాయంగా కొనసాగిస్తోంది. నెట్‌వర్క్ ఆస్పత్రుల నుంచి ఇబ్బందులు ఎదురైతే ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్, 104 కాల్‌సెంటర్, హెల్ఫ్‌డెస్క్, ఆరోగ్య మిత్రలను సంప్రదిస్తే పరిష్కారం లభి స్తుంది. రేషన్‌కార్డులు లేకపోవడం, కార్డుల్లో పేర్లు నమోదు చేయకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొనే రోగులకు సిఎంసి లెటర్ ద్వారా వైద్య సేవలకు అర్హత కల్పిస్తాం. కేంద్రంలో ఆయుష్మాన్‌భారత్, ఆయు ష్మాన్ వయో వృద్ధుల పథకంలో భాగంగా రూ. ఐదు లక్షల వరకు 70 ఏళ్లు నిండిన వృద్దులకు ఉచిత వైద్యసేవలు అందిస్తోందని ఆధార్ కార్డుతో ఇకెవైసి అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొంటున్న ఎన్‌టిఆర్ వైద్యసేవ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ వి.బాలాంజనేయులుతో ముఖాముఖి…నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్‌వైద్యసేవలు నిలిపేయడంపై స్పందించండి? జిల్లాలోని కొన్ని ప్రయివేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవలను పూర్తిగా నిలిపేశారనే మాట అవాస్తవం. చేతి వేళ్ల మీద లెక్కపెట్టగల ఆస్పత్రుల్లో మాత్రమే నిలిపేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజ మాన్యాలతో సంప్రదింపులు జరపడంతో ఎన్టీఆర్ వైద్యసేవలను కొన సాగిస్తున్నారు.ఎన్‌టిఆర్ వైద్యసేవ నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఎన్ని? జిల్లావ్యాప్తంగా ఎన్‌టిఆర్ నెట్‌వర్క్ పరిధిలో 104 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇందులో ప్రయివేటు 43, పిహెచ్‌సి 53, సిహెచ్‌సి 07, ప్రభుత్వం 01, జిజిహెచ్‌లు 02, జిల్లా ఆస్పత్రి 01, ఏరియా ఆస్పత్రి 01 ఉన్నాయి. అత్యధిక సర్జరీ కేసులేమిటి? రాష్ట్రప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 3,245 వ్యాధులకు చికిత్సలు అందిస్తోంది. ఉమ్మడి కడప జిల్లావ్యాప్తంగా అత్యధికంగా ఆర్ధోపె డిక్, గైనకాలజీ, కార్డియాలజీ, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా చికిత్సలు చేయించుకుంటున్నారనేది ఓ అంచనా. కార్డులు, పేర్లు లేని రోగుల పరిస్థితేమిటి? రేషన్‌కార్డులు లేని, పేర్లు గల్లంతైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించే ప్రయత్నం చేస్తున్నాం. దీని కింద చికిత్స తీసుకోవా లనుకుంటున్న రోగులకు సిఎంసి లెటర్‌ను అందించి ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు సిఫారసు చేస్తాం. ఆరోగ్యశ్రీ రోగులు ఫిర్యాదు చేయాలనుకుంటే ఎలా? ఎన్‌టిఆర్ వైద్యసేవలు సక్రమంగా అందని పక్షంలో రోగులు హెల్ప్ డెస్క్, ఆరోగ్యమిత్ర, 104 కాల్‌సెంటర్లను ఆశ్రయించే సదు పాయం కల్పించాం.ఆయుష్మాన్ భారత్ హెల్త్‌కార్డుదారుల వివరాలు చెప్పండి? జిల్లాలోని 36 మండలాల పరిధిలో ఆయుష్మాన్‌భారత్, వయో వందన పథకం కింద 1,60,292 మంది వృద్ధులు ఉన్నట్లు గుర్తించాం. మరో 90 వేల మందికి ఇకెవైసి చేయడం జరుగుతోంది. జిల్లాలోని అర్హులైన వృద్ధులు ఎఎన్‌ఎంలను సంప్రదించి ఆధార్ కార్డు తో ఇకెవైసి చేయించుకోవాలి.
