ప్రజాశక్తి-కపిలేశ్వరపురం (కోనసీమ) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని అమలాపురం పార్లమెంటరీ టిడిపి అధికార ప్రతినిధి పుత్సల శ్రీనివాస్ అన్నారు. టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకొని శనివారం అంగరలోని ఎన్టీఆర్ విగ్రహానికి టిడిపి నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి ఎన్టీఆర్ పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. కపిలేశ్వరపురం వెదురుమూడి, వల్లూరు, కాలేరు, నేలటూరు, కేదర్లంక, తదితర గ్రామాల్లో కూడా టిడిపి నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కపిలేశ్వరపురం లో నిర్వహించిన ఎన్టీఆర్ ఆర్ వర్ధంతి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాకా శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వల చిట్టిబాబు , కొప్పిశెట్టి శ్రీనివాసు, తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.
