ప్రజాశక్తి- ములగాడ : యుపిఎస్‌ను రద్దుచేసి, ఒపిఎస్ అమలు చేయాలని కోరుతూ డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు నేవల్ సివిలియన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నేవల్ డాక్‌యార్డ్ విజయనగర్ గేటు వద్ద నిరసన చేపట్టారు. రెండురోజుల ఆందోళనలో భాగంగా శుక్రవారం తొలిరోజున యూనియన్ అధ్యక్షులు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఆందోళనలో ప్రధాన కార్యదర్శి జి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యుపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్ వెంటనే అమలు చేయాలని, ఎనిమిదవ వేతన సంఘం కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్‌సిఇ యూనియన్ ఆఫీస్ బేరర్స్, వర్క్స్ కమిటీ మెంబర్లు, జెసిఎం మెంబర్స్, సొసైటీ డైరెక్టర్లు ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
కరాస: ఏకీకృత పెన్షన్ విధానం(యుపిఎస్) వద్దని, పాత పెన్షన్‌ను అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారం ఎన్‌ఎడి ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. అక్కడే యుపిఎస్‌కు వ్యతిరేకంగా బహిరంగ సభ నిర్వహించి, ఒపిఎస్ సాధనకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు. ఈసందర్భంగా కాకాని నగర అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్‌ఎడి సిఇ యూనియన్ ప్రధాన కార్యదర్శి తల శ్రీనివాస్, డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ రెడ్డి వెంకట్రావు మాట్లాడుతూ, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు కార్మికుల ఐక్య పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.నిరసనలో యూనియన్ నాయకులు కార్యకర్తలు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నేవల్ డాక్‌యార్డ్ విజయనగర్ గేటు వద్ద నిరసన