ప్రజాశక్తి -యంత్రాంగం తగరపువలస : ఫార్మసీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉందని మాజీ మంత్రి, అవంతి విద్యా సంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక అవంతి ఫార్మసీ కళాశాలలో బుధవారం అంతర్జాతీయ ఫార్మాసిస్టుల దినోత్సవాన్ని ముత్తంశెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సమాజంలో వైద్యులతో సమానంగానే ఫార్మాసిస్టులు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఔషధాల తయారీలోను, ఎగుమతుల్లోనూ భారతదేశం, ఎపి ముందు వరుసలో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. వైద్య రంగంలో ఫార్మాసిస్టుల పాత్రను ప్రశంసించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజు అధ్యక్షతన జరిగిన సభలో ఎయు ఇంక్యూబేషన్ సెంటర్ కో ఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఫార్మాసిస్టులకు పలు అంశాలపై నిర్వహించిన వ్యాసరచన, పోస్టర్ ప్రెజెంటేషన్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందిస్తూ ముత్తంశెట్టి శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు.రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌లకు నైపుణ్య శిక్షణ మధురవాడ : ఔషధ, ఆరోగ్యరంగంలో తక్షణ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా బి.ఫార్మశీ, ఎమ్.ఫార్మశీ పూర్తిచేసుకున్న రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌లకు ఈ ఏడాది అక్టోబర్ నుంచి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఫార్మశీ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్ డాక్టర్ విలియమ్ క్యారీ వెల్లడిరచారు. ప్రపంచ ఫార్మసిస్ట్‌ల దినోత్సవ సందర్భంగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రధాన మంత్రి కుశాల్ వికాశ్ యోజనలో భాగంగా ఫార్మశీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సహకారంతో ఉచిత నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన నైపుణ్య అంశాలపై నాలుగు రోజుల పాటు 6 వేల మంది రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌లకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఏటా 8 వేల మంది బి.ఫార్మశీ పూర్తిచేసుకున్న విద్యార్థులు కౌన్సిల్‌లో పేర్లు నమోదు చేయించుకుంటున్నారని వివరించారు. కోవిడ్ తరువాత దేశంలో ఫార్మసిస్ట్‌లకు ప్రాధాన్యత పెరిగిందని, ముఖ్యంగా క్లినికల్ ఫార్మశీ ప్రాధాన్యత సంతరించుకుంటుందని తెలిపారు. ఫార్మశీ విద్యను అభ్యసించే యువత శాస్త్రీయ పరిజ్ఞానం, క్లినికల్ పరిజ్ఞానంతో పాటు అనుబంధ విభాగాలపై నైపుణ్యాలను కలిగి ఉండాలని సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ డీన్ ప్రొఫెసర్ జగత్తరణ్‌దాష్ మాట్లాడుతూ, ప్రపంచ ఔషధ రంగంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోందని, ముఖ్యంగా జనరిక్ ఔషధాల తయారీలో, ఎగుమతిలో అగ్ర స్థానంలో ఉందని తెలిపారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ విశిష్ట ప్రొఫెసర్ రామారావు మాట్లాడుతూ, ఔషధ రంగంలో ప్రవేశించే వారు అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఔషధ ప్రమాణాలను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్.రాజా, డాక్టర్ ఎన్.శ్రీరామ్, డాక్టర్ కె.ప్రకాశ్, డాక్టర్ ఎల్.శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.మాట్లాడుతున్న అవంతి విద్యా సంస్థల చైర్మన్ ముత్తంశెట్టి