మద్యం దుకాణాలు మూసి నిరసన ప్రజాశక్తి-యర్రగొండపాలెం : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్న సేల్స్‌మెన్‌లు, సూపర్ వైజర్లు మంగళవారం నిరసన తెలిపారు. మధ్యాహ్నం నుంచి బ్రాందీ షాపులను మూసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు విలియం కేరీ, అహరోన్, మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత లేని కారణంగా కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ జీవోలో ఇచ్చిన ప్రకారం తమకు రావాల్సిన బకాయిలు మంజూరు చేయాలన్నారు. నూతన పాలసీ విధానంలో ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాలలో తమకు విధులు నిర్వహించే అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాములు నాయక్, సురేష్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.