May 15,2024 22:15

నీలమాంబపురంలో చోరీ

8 తులాల బంగారం, 5 లక్షల నగదు అపహరణ

ప్రజాశక్తి-జియ్యమ్మవలస : మండలంలోని ఇటిక పంచాయతీ నీలమాంబపురం గ్రామానికి చెందిన పురోహితుడు కర్రి సతీష్‌ ఇంటిలో చోరీ జరిగింది. ఈనెల 10న తన మేనమామ మృతిచెందడంతో సతీష్‌ కుటుంబ సమేతంగా రంపచోడవరం వెళ్లారు. 13న ఓటు వేసేందుకు సతీష్‌ వచ్చి చూడగా ఇంటి తాళం తీసి ఉంది. బీరువా తాళం విరగ్గొట్టి ఎనిమిది తులాల బంగారం, సుమారు 5 లక్షల పైబడి నగదు చోరీకి గురైనట్లు జియ్యమ్మవలస పోలీస్‌ స్టేషన్లో ఆయన ఫిర్యాదుచేశారు. ఎస్‌ఐ పి.అనిష్‌ కేసు నమోదు చేశారు. బుధవారం పాలకొండ డిఎస్‌పి జి.వి కృష్ణారావు, చినమేరంగి సిఐ మంగరాజు గ్రామానికి చేరుకుని, దర్యాప్తు చేశారు. క్లూస్‌టీమ్‌ వివరాలు సేకరించింది.

కాశీపట్నం ఆర్‌బికెలో చోరీ

కంప్యూటర్లు, టీవీ ఎత్తుకెళ్లిన దొంగలు

ప్రజాశక్తి-మక్కువ : మండలంలోని కాశీపట్నం సచివాలయ పరిధిలో ఉన్న ఆర్‌బికెలో దొంగలు చొరబడి కంప్యూటర్లు, స్మార్ట్‌టీవీని ఎత్తుకుపోయారు. ఎన్నికల తర్వాత విధుల్లోకి వెళ్లిన ఉద్యోగులకు కంప్యూటర్‌ లేని విషయాన్ని గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదును అందజేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరసింహమూర్తి తెలిపారు.

➡️