సారించాలిప్రజాశక్తి -కడప అర్బన్‌ వైఎస్‌ఆర్‌ జిల్లాను డయేరియా రహిత, ఆరోగ్యసహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక దష్టి సారించాలని కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌ బోర్డు మీటింగ్‌ హాలులో నగర కమిషనర్‌ జి.ఎస్‌.ఎస్‌. ప్రవీణ్‌ చంద్‌, డిఆర్‌ఒ గంగాధర్‌ గౌడ్‌తో కలిసి డయేరియా, సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య భద్రతపై కలెక్టర్‌ మండల స్థాయి అధి కారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా ఖాజీపేట మండలం మిడుతూరులో 19 ఏళ్ల యువకుడు అనారోగ్యంతో మతి చెందిన సం ఘటన జిల్లా అధికార యంత్రాంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావతం కాకుండా వైద్యా ధికారులు, పబ్లిక్‌ హెల్త్‌, పంచాయతీ, మున్సిపల్‌ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలో వైద్యారోగ్య, ప్రజారోగ్య, పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, ఇంజినీరింగ్‌ సిబ్బంది బాధ్యతగా, విధిగా పనిచేస్తేనే ప్రజరోగ్య భద్రత సాధ్యం అవుతుందన్నారు. సంబంధిత అధికారులు తప్పకుండా రోజూ విధులకు హాజరవుతూ కింది స్థాయి సిబ్బందిని కూడా సకాలంలో విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజారోగ్య భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన చర్యలు, సస్పెన్షన్‌ వేటు తప్పదని హెచ్చరించారు. ఎఎన్‌ఎం, ఆశా, సిబ్బందితో ప్రతివారం సమావేశం ఏర్పాటు చేసుకుని ఆరోగ్య కేంద్రాల పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై తగు సూచనలు చేయాలని వైద్యా ధికారులకు సూచించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకో వాలన్నారు. అన్ని రకాల సీజనల్‌ డ్రగ్స్‌ను అందు బాటులో ఉంచాలన్నారు. ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వచ్చిన రోగులతో ఆపా ్యయంగా పలకరించి వైద్య సేవలు అందిం చాలన్నారు. ఇఒపిఆర్‌డి మున్సిపల్‌ కమిషనర్లు వారి పరిధిలోని అన్ని రకాల మంచినీటి పథకాల నిర్వహణలో క్రమం తప్పకుండా క్లోరినేషన్‌ చేయించేలా చర్యలను చేపట్టాలని జిల్లాలో ప్రతి శుక్రవారాన్ని డ్రైడేని పాటించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు వేడి నీటిని తాగడం, స్వీయ పరిశుభ్రతను పాటించడంపై అవగాహన, విస్తత ప్రచారం చేపట్టాలన్నారు. జిల్లాలో ఎక్కడ డయేరియా సంబంధిత మరణాలు సంభవి ంచడానికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. ఎక్కడైనా బయోలజికల్‌ కాంటా మినేషన్‌తో మరణాలు సంభవిస్తే సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్‌ అసి స్టెంట్లపై సస్పెన్షన్‌ వేటు తప్పదన్నారు. ముఖ్యంగా అన్ని సంక్షేమ శాఖల అధికారులు సంబందిత హాస్టళ్లలో, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో మంచినీటి సదుపాయాలు, వాటర్‌ ట్యాంకుల పారిశుధ్యంపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ము ఖ్యంగా వంట మనుషులకు వంట నిర్వహణలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, భోజన శాలలను శుచిగా శుభ్రంగా ఉంచుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే డయేరియా, ప్రజారోగ్య భద్రత, పారిశుధ్య చర్యలు చక్కబెట్టేందుకు జిల్లా స్థాయి నుండి మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, ఇంజినీరింగ్‌ సిబ్బంది ప్రతి గ్రామంలో అన్ని గహాలలో కుళాయి నీటి సదు పాయం నిర్వహణ పనులను పరిశీలించి రాండంగా నీటి పరీక్షించాలన్నారు. కార్యక్రమంలో కడప ఆర్‌డిఒ వెంకటపతి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగ రాజు, ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ అయిషాన్‌ బాషా, డిఇఒ అనురాధ, సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతి, మైనార్టీ, ఎస్సి కార్పొరేషన్‌ ఇడి, బిసి వెల్ఫేర్‌ అధికారి డాక్టర్‌ వి. బ్రహ్మయ్య, డిజేబుల్‌, మైనారిటీ సంక్షేమ శాఖా అధికారి కష్ణ కిశోర్‌, మైనారిటీ వెల్ఫేర్‌ అధికారి ఇమ్రాన్‌, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమాదేవి, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు, ఆయా మండలాల నుంచి మండల స్థాయి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

➡️