ప్రజాశక్తి-మార్కాపురం : చిన్నారులందరికీ పోషకాహారం తప్పనిసరి అని ఐసిడిఎస్ సూపర్‌వైజర్ కె.రవికుమారి తెలిపారు. మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని చెన్నరాయునిపలి ్లలోని కోడ్ నెంబర్ 66లోని అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహార పక్షోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమారి మాట్లాడుతూ పౌష్టికాహారం లోపిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులతో పాటు గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం అవసరమన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో పాలు, కోడిగుడ్లు, ఇతర ఆహార పదార్ధాలను క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. పౌష్టికాహారంలో లోపం తలెత్తినట్లయితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతోందో వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.శ్రీనివాస నాయక్, అంగన్‌వాడీలు కె.సుగుణమ్మ, ఎ.సుశీలమ్మ, సిహెచ్.అంకమ్మ, ఎఎన్‌ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. యర్రగొండపాలెం : మండల పరిధిలోని పాలుట్ల గిరిజన గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. అనంతరం ఆర్‌డిటి స్వచ్ఛంద సంస్థ వైద్యుల ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జీరో నుంచి ఆరు సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారుల ఎత్తు, బరువు తనిఖీ చేశారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనీమియా ఉన్న చిన్నారులు, బరువు తక్కువగా ఉన్న పిల్లల తల్లులకు పౌష్టికాహారంపె అవగాహన కల్పించారు. పౌష్టికాహారం ప్రాముఖ్యత, ముడ ిపదార్థాల ఎంపిక, తినిపించే సమయాల్లో పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఒ పద్మావతి ఐసిడిఎస్ సూపర్ వైజర్లు ఎ. పద్మజ, కెవి.సుబ్బమ్మ, శివలక్ష్మి, హైమావతి, అంగన్‌వాడీలు నాగమణి బాయి, ఈదమ్మ, పెద్ద ఈదమ్మ, హనుమాయమ్మ పాల్గొన్నారు. యర్రగొండపాలెంలోని ఉట్లస్తంభాల వీధిలోనున్న అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. మహిశలు, గర్భిణులను అభినందించారు. ముందుగా అంగన్‌వాడీ కేంద్రాన్ని పూలు, బొమ్మలతో సుందరంగా అలంకరి ంచారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్త జి పద్మావతి మాట్లాడుతూ ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉండటం ద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. పోషణ పక్వాడ కార్యక్రమం ద్వారా గర్భిణులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎన్‌ఎం సంధ్యారాణి, ఆశా కార్యకర్త వాణి శిరీష, అంగన్‌వాడీ ఆయా వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు రూరల్ : గిద్దలూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని కిష్టంశెట్టిపల్లి అంగన్‌వాడీ కేంద్రాలలో ఇన్‌ఛార్జి సిడిపిఒ బి. జ్యోతి అధ్యక్షతన పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు బెస్ట్ ఫీడింగ్‌పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు లక్ష్మి, రాధ, రామజ్యోతి,కోటేశ్వరమ్మ ,రంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
