ప్రజాశక్తి-కొండపి : ప్రతి ఒక్కరూ పౌష్టి కాహారాన్ని తీసుకోవాలని సిడిపిఒ మాధవీలత తెలిపారు. పోషణ్ పక్వాడ వారోత్స వాలలో భాగంగా స్థానిక దాసరెడ్దిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా సిడిపిఒ మాట్లాడుతూ పౌష్టికాహారం ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణానికి దోహద పడుతుందన్నారు. కౌమార దశలోని బాలికలు, గర్భిణులు, బాలిం తలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్ వైజర్ విక్టోరియా రాణి, బాలింతలు, చిన్నారులు, గర్భిణులు పాల్గొన్నారు. మద్దిపాడు : చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఎంపిడిఒ ప్రసాద్ తెలిపారు. పోషణ పక్వాడ కార్యక్ర మంలో అంగన్‌వాడీలకు ఆరోగ్యకరమైన తినుబండారాలను తయారీ, వాటిని నిల్వ చేసే విధానంపై మంగళవారం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ చిన్నారులకు రుచికరమైన పదార్ధాలు పెడితే వారు అంగవాడీ కేంద్రాలకు వస్తారని తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితులు గమనిస్తూ సంపూర్ణ పోషణ అందిం చాలన్నారు. ఎంఇఒలు ఆంజనేయులు, మెడబలిమి శ్రీనివాస రావు మాట్లాడుతూ అంగన్‌వాడీలు తమ కేంద్రాల్లోని పిల్లలను ప్రాథమిక పాఠశాలలలో చేర్పించాలన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహార పదార్ధాలు తయారు చేసి ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దారు సుజన్ కుమార్, ఎపిఎం సుబ్బారావు, సిహెచ్ లలితమ్మ, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు జయలక్ష్మి నాగరాజ, పద్మావతి, అంగన్‌వాడీలు, వెల్ఫేర్‌అసిస్టెంట్లు, సిఆర్‌పిలు తదితరులు పాల్గొన్నారు.
