ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : నగరంలోని కలెక్టరేట్లో స్వాతంత్య్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలు ఆ శాఖ ఇంచార్జ్ అధికారి ఫణి ధూర్జటి ఇతర అధికారులతో కలిసి వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి తరం స్వాతంత్య్ర సమరయోధుడుగా పేరుగాంచిన వడ్డే ఓబన్న స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైనిక అధ్యక్షుడిగా పని చేస్తూ, రైతులపై బ్రిటిష్ వారు విధించిన పన్నులకు వ్యతిరేకంగా 1845లో వడ్డే ఓబన్న నేతఅత్వంలో ఉద్యమం కొనసాగిందని, ఈ ఉద్యమంలో వడ్డే ఓబన్న కీలక పాత్ర పోషించారన్నారు. తొలి నుండి వడ్డే ఓబన్న పేద రైతుల, గ్రామస్తుల హక్కులను కాపాడడానికి వారికి న్యాయం చేయాలని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రతిఘటించి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని కొనియాడారు.భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకమైన పాత్రను పోషించి స్వరాజ్యం కోసం చేసిన కఅషి చేసిన వ్యక్తిగా, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన సాగించిన ఉద్యమ పోరాటం అందరూ గర్వించదగిన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి సిహెచ్ వీరాంజనేయ ప్రసాద్, వడ్డెర సంఘ నాయకులు , వేముల దుర్గారావు, కొంచెపు రాజేష్, శివరాత్రి నాగరాజు, బత్తుల దుర్గారావు, బోసు దుర్గారావు, గుంజ దుర్గారావు, బత్తుల వాణి , బత్తుల లక్ష్మి, బత్తుల అనురాధ, చల్లా జోషి, కుంచెపు రాజు, తురాక రాంబాబు తదితరులు పాల్గొన్నారు.