ప్రయివేటు పాఠశాలల్లో పరిశీలన

Jun 11,2024 22:45
ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న ఎంఇఒ-2 మస్తాన్‌వలీ

ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న ఎంఇఒ-2 మస్తాన్‌వలీ
ప్రయివేటు పాఠశాలల్లో పరిశీలన
ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రయివేటు పాఠశాలలను మండల విద్యాశాఖ అధికారి షేక్‌ మస్తాన్‌ వలీ, తన బృందం తనిఖీ చేశారు. మంగళవారం ప్రభుత్వ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఉదయగిరి మండల విద్యాశాఖ అధికారి-1 షేక్‌ మస్తాన్‌ వలీ, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వి బాలకేశవులు, శివరామి రెడ్డితో కూడిన బృందం అన్ని ప్రయివేటు పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారుల బృందం ప్రయివేటు పాఠశాలల్లో మౌలిక వసతులును, బోధనా సిబ్బంది అర్హతలను, పాఠశాలల వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫిట్నెస్‌ సర్టిఫికెట్లు, పాఠశాల అన్ని రికార్డులను తనిఖీ చేస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సిలబస్‌ పాఠ్యపుస్తకాలను బోధించాలని ప్రతి ఒక్కటి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అమలు చేయాలని యాజమానులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఐఎస్‌ అలీమ్‌ పాల్గొన్నారు.

➡️