ఆంధ్రాలో బోల్తా పడిన ఒడిశా ఆటో

Jun 10,2024 21:50

ప్రజాశక్తి -కొమరాడ : ఒడిశాకు చెందిన ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయలైనట్లు స్థానికులు తెలిపారు. మన్యం జిల్లా కొమరాడ మండలం మారుమూల గిరిజన కుజ్జాబడి -జల గ్రామాల మధ్య కొండపై ఈ ప్రమాదం సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో కొరాపుట్‌ జిల్లా జిల్లా బందుగాం బ్లాక్‌ అలమండ పంచాయతీ కవిటి గ్రామానికి చెందిన కడ్రక చింతలమ్మ (20)కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మిగిలిన ప్రయాణికుల కాళ్లు, చేతులు విరిగిపోవడంతో వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొమరాడ మండలం పెద్ద శాఖ పంచాయతీ గుజ్జాబడికి ఒరిస్సా రాష్ట్రం కేటా గ్రామం నుంచి పెళ్లికి ఆదివారం వెళ్లారు. తెల్లవారిన పెళ్లి అయిపోయిన తర్వాత ఆటోతో తమ స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న సమయంలో కుజ్జాబడి -జల గ్రామాల మధ్య కొండపై ఉన్న రహదారిపై ఆటో అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కొమరాడ ఎస్సై నీలకంఠం స్పందించి అక్కడికి చేరుకున్నారు. తక్షణమే అందుబాటులో ఉన్న అంబులెన్సుల ద్వారా క్షతగాత్రులను పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో డ్రైవర్‌ పీడక ప్రసాదు, మరో ప్రయాణికులు కె.సీమ, పీడిక లచ్చి, పీడిక బాలమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే పీడిక పోలమ్మ ఎడమ చేయిరిగిపోయింది. పీడక కూర్మి కడుపు నొప్పితో బాధపడుతుంది. పీడిక జియా ఎడమ చేయి విరిగిపోయింది. కట్రక తులసమ్మ, పీడిక సంగీత, సన్యాసమ్మ ముఖాలపై తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 16 మందికి తీవ్ర గాయాలైనట్లు ఎస్‌ఐ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇది రెండోసారి కావడంతో ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడింది. గతంలో కొండ నుంచి కిందకు దిగుతున్న ఘటనలో కమాండర్‌ ట్రాక్టర్‌ బోల్తా పడి పలు మృతి చెందిగా, పలువురు గాయలైన ఘటన రెండేళ్ల క్రితం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు రెండు ప్రభుత్వాలు పరిహారం చెల్లించాలి : సిపిఎంఆటో ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులతో పాటు గాయలైన కుటుంబ సభ్యులకు ఆంధ్రా, ఒడిస్సా ప్రభుత్వాలు పరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు. సోమవారం మన్యం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఆటో ప్రమాదానికి గురై మరణించిన చిన్న తల్లి, గాయాలపాలైన గిరిజనులను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాధితులంతా ఒడిశాకు చెందిన పేద గిరిజనులేనని, ఇలా జరగడం చాలా బాధాకరమన్నారు. చనిపోయిన చినతల్లి కుటుంబానికి రూ.30 లక్షలు, క్షతగాత్రులకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియో చెల్లించి ఆదుకోవాలని కోరారు. అలాగే క్షతగ్రాతులకు సత్వర చర్యలు అందించిన 108 సిబ్బందిని అభినందించారు.క్షతగాత్రులను టిడిపి పరామర్శ ఆటో ప్రమాదంలో గాయపడిన బాధితులను మండల టిడిపి కన్వీనర్‌ ఉదయ శేఖర్‌ పాత్రుడు జిల్లా కేంద్రాసుపత్రికి వెళ్లి పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించి త్వరగా కోలుకునేలా వైద్యసేవలు అందించాలని వైద్యులను కోరారు.

➡️