అధికారులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటా.. : ఎమ్మెల్యే ఆదిమూలం

ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి) : పిచ్చాటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో సత్యవేడు, పిచ్చాటూరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని 8 మంది అంగన్వాడి హెల్పర్లకు నియామక పత్రాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ … అంగన్వాడి ఆయా పోస్టులు నియామకం పారదర్శకంగా జరిగిందన్నారు. పోస్టులు పొందినవారి నుండి ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వద్దని.. తన పేరు చెప్పి డబ్బులు అడిగినా ఇవ్వద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ క్రమంలో అధికారులకు ఎవరైనా ఫోన్‌ చేసి బెదిరింపులకు పాటుపడితే భయపడద్దని.. తన దఅష్టికి తీసుకువస్తే వెంటనే ఉన్నతాధికారులు ద్వారా సమస్యను పరిష్కరిస్తానని.. ఎమ్మెల్యే భరోసా కల్పించారు. తనను ఎన్నికలలో ఓడించాలని కుట్రలు చేసిన వారే తనపై కుయుక్తులు పన్నుతున్నారని.. అయితే ఇలాంటి కుయుక్తులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కల్పించిన రిజర్వేషన్‌ వల్ల.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనకు పెట్టిన టికెట్‌ బిక్షతో, గౌరవ మంత్రి నారా లోకేష్‌ తనకు అందించిన సహకారంతో, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. అనంతరం సత్యవేడు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 5 మందికి, పిచ్చాటూరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ముగ్గురికి మొత్తం 8 మంది హెల్పర్‌ పోస్టులకు నియామక పత్రాలను ఎమ్మెల్యే ఆదిమూలం చేతుల మీదుగా పంపిణీ చేశారు. చివరగా పిచ్చాటూరు మండలం నీరువాయి గ్రామానికి చెందిన నాగరాజ్‌ కు సమాచార హక్కు చట్టం జిల్లా కార్యదర్శి నియామక పత్రాన్ని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు, పిచ్చాటూరు సీడీపీఓ లు దేవ కుమారి, శోభారాణి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ డి. ఇళంగోవన్‌ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు పద్దు రాజు, ఎస్‌.ఎం సురేష్‌, మల్లిఖార్జున రెడ్డి, వాసు రెడ్డి, డిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️