ప్రజాశక్తి – పెద్దాపురం : పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలోని శాంతి వర్ధన దివ్యాంగ బాలల ఆశ్రమ పాఠశాలను మంగళవారం జూనియర్ జస్టిస్ యాక్ట్ ఇన్స్పెక్షన్ బృందం తనిఖీ చేశారు. ఈ బృందంలో డిపిఓ చంద్రశేఖర్, డి సి పి ఓ సిహెచ్ వెంకట్రావు, సిడి పి ఓ జి ఉష, ఎల్ సి పి ఓ ఎం సుధాకర్, పి ఓ ఐ సి కే శ్రీనివాస్ లు పాల్గొన్నారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం బాలలతో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలను తనిఖీ చేయడంలో భాగంగా వారు ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాఠశాల రిజిస్టర్లను, పాఠశాల పరిసరాలను, వంటశాల టాయిలెట్స్, పాఠశాల గదులను, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను, విద్యార్థులకు నిర్వహిస్తున్న బోధనా విధానాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, బాలలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఫౌండర్ రాయవరపు వీరబాబు, సత్యవేణి , ఏవో వేణుగోపాల్, బాబి తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/special-child-copy.jpg)