మంత్రి బీసీని కలిసిన వివిధ శాఖల అధికారులు

ప్రజాశక్తి – బనగానపల్లె : పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని వివిధ శాఖల అధికారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కర్నూల్ జడ్పీ సీఈఓ జి. నర్సారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రేమంత్ కుమార్, ఇతర అధికారులుమంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది, మద్దిలేటి స్వామి ఆలయ సిబ్బంది, పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి న్యూఇయర్ విషెస్ తెలిపారు. స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. సెంట్రల్ పవర్ గ్రిడ్ గుత్తి డివిజన్ డీజీఎం, జీఎం, కర్నూలు ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎం భూపాల్ రెడ్డి లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

➡️